నెల్లూరు రూరల్: జిల్లాలోని ఎస్సీలకు సంక్షేమ పథకాలు నూరు శాతం అందేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు శ్రీపతిబాబు, భిక్షం, రామాజనమ్మ, సెక్రటరీ చిన్నరాముడితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జవహర్ గురువారం నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, డీఆర్వో విజయకుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
వినతుల అందజేత
ఎస్సీ కమిషన్ సభ్యులకు 196 వినతులు అందాయి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తామని జవహర్ తెలిపారు.


