● కిందపడి యువకుడికి గాయాలు
రాపూరు: ఫోన్ చూస్తూ.. మెట్లెక్కుతూ కిందపడటంతో యువకుడు గాయపడిన ఘటన మండలంలోని వెలుగోను గిరిజన కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో ఉన్న మిద్దైపె నిద్రించేందుకు సిసింద్రీ మంగళవారం రాత్రి వెళ్లారు. ఈ క్రమంలో ఫోన్ చూస్తూ.. మెట్లెక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డా రు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక వైద్యం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు తరలించారు.


