మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ – ఉన్ – నబీని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని మసీదుల్లో ప్రత్యేక దువా చేశారు. వివిధ ప్రాంతాల్లో అన్నదానాలను చేపట్టారు. కామాటివీధిలోని ఆయేషా మసీదు నుంచి కోటమిట్ట వద్ద గల అమీనియా మసీదు మీదుగా ప్రదర్శనను నిర్వహించారు. మతపెద్దలు, ఇమామ్‌లు, మౌల్వీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలతో ప్రత్యేక వాహనంపై తీర్చిదిద్దిన మక్కా, మసీదు నమూనాలు, ఒంటెలు, వాహనాలతో నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది.
– నెల్లూరు(బృందావనం)


