అదుపుతప్పిన కారు | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన కారు

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

యువకుడికి గాయాలు

కోవూరు: నెల్లూరు నుంచి రాజుపాళెం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. రామన్నపాళెం గేట్‌ సమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో రాజుపాళెందిన్నె గ్రామానికి చెందిన గంగపట్నం శ్రీనివాసులు గాయపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీనివాసులు కారులో ప్రయాణిస్తుండగా రామన్నపాళెం గేట్‌ వద్దకు చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని 108 సిబ్బందికి అందించారు. 108 టెక్నీషియన్‌ అలీ, పైలట్‌ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం నెల్లూరుకు తీసుకెళ్లారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. అతివేగమా, లేక వాహనం అదుపు తప్పిందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. రామన్నపాళెం గేట్‌ ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement