నెల్లూరు(టౌన్): రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ముగ్గురు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 60 రోజుల క్యాంపునకు ఎంపికయ్యారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ అప్సర (మేథో వైకల్యం) 400 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్ విభాగాల్లో ప్రతిభ చూపి మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అదే పాఠశాలకు చెందిన మెదబలిమి నిత్యశ్రీ (లోకో మోటర్ వైకల్యం)కు షాట్‌పుట్ విభాగంలో రజత పతకం వచ్చింది. ఇందుకూరుపేట మండలం ఆదెమ్మసత్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కేతగాని జ్ఞాన వెంకటచందు పరుగు విభాగంలో రజత పతకం సాధించారు. ఈనెల 29వ నుంచి విశాఖపట్నంలోని ఏఎంటీజెడ్ క్యాంపస్‌లో రాష్ట్ర సమగ్ర శిక్ష, రాష్ట్ర పారా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపులో వీరు పాల్గొననున్నారు. విద్యార్థులను డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య బుధవారం అభినందించారు. నవంబర్‌లో జరిగే జాతీయ పారా ఒలింపిక్ క్రీడల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
షేక్ అప్సర
నిత్యశ్రీ
వెంకటచందు


