● డీఈఓ కార్యాలయం ఎదుట
యూటీఎఫ్ నిరసన
నెల్లూరు(టౌన్): ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. టెట్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక టెట్ ఇస్తామని చెప్పి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎలాంటి సవరణలు చేయకపోవడం టీచర్లను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఏలు ఏ సబ్జెక్టును బోధిస్తారో, అదే సబ్జెక్టు సిలబస్‌లో టెట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషులు, గౌరవాధ్యక్షుడు అచ్చయ్య, అసోసియేట్ అధ్యక్షుడు ఖాజావలీ, కోశాధికారి మురళీధర్, కార్యదర్శులు నాగిరెడ్డి, అనిల్‌కుమార్, రమణయ్య, శ్రావణ్‌కుమార్, బాలరాగయ్య, శైలజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుసూదనరావు, జమీర్ అహ్మద్, మనోహర్‌బాబు పాల్గొన్నారు.


