మద్యం మత్తులోనే హత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులోనే హత్య

Aug 26 2026 12:00 AM | Updated on Aug 26 2026 12:00 AM

నిందితుడి అరెస్ట్‌

కలిగిరి: మండలంలోని నాగిరెడ్డిపాళెం సెంటర్‌లో సంగన రామిరెడ్డి అనే వృద్ధుడి హత్య కేసులో నిందితుడు సంజీవ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలిగిరి పోలీస్‌స్టేషన్‌లో సీఐ పి.సుబ్బారావు మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 23వ తేదీన సంజీవ్‌కుమార్‌ మద్యం మత్తులో క్షణికావేశంలో 90 సంవత్సరాల వృద్ధుడు రామిరెడ్డిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతడిపై రౌడీషీట్‌ తెరుస్తామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో కలిగిరి, వింజమూరు ఎస్సైలు లతీఫున్నీసా, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement