నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు రికార్డు అసిస్టెంట్లకు జూనియర్ సహాయకులుగా, ఎనిమిది మంది ఆఫీస్ సబార్డినేటర్లకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శనివారం జెడ్పీ కార్యాలయంలో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ వసుమతి, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య అందజేశారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు సకాలంలో చేస్తున్నామన్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు 257 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. కాగా ఇందుకు సహకరించిన జెడ్పీ చైర్‌పర్సన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్కాకుల పెంచలయ్య, కార్యదర్శి దేవా ప్రసన్నకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారి ముజీబ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు మాబాషా తదితరులు పాల్గొన్నారు.


