● జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు (పొగతోట): జెడ్పీ ప్రత్యేక నిధుల తో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించి విజయదీపిక ద్వారా పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకుల సాధించాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆకాంక్షించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, సైకిల్‌పై కూడా వెళ్లడానికి కూడా వీల్లేకుండా దెబ్బతిన్నాయని, గ్రామాలకు వెళితే ప్రజలు తిడుతున్నారని జెడ్పీటీసీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ పనులు పూర్తి చేసి న బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీలకు గౌరవ వేతనం మంజూరు చేసి 25 నెలలు కావొస్తుందని త్వరగా చెల్లించకపోతే సభ్యులందరం సమావేశంలో ధర్నా చేస్తామని మర్రిపాడు జెడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి సమాధానమిచ్చారు. జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని, అనుమతి లేకుండా సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు ఇవ్వా లని ఆదేశించారు. వరి కోతలు ప్రారంభమయ్యాయ ని రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించా లన్నారు. ఈ సమావేశాల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, వివిధ మండలాలు జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


