రాజీ మార్గమే లోక్‌ అదాలత్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గమే లోక్‌ అదాలత్‌ లక్ష్యం

Mar 15 2026 1:02 AM | Updated on Mar 15 2026 1:02 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌

నెల్లూరు (లీగల్‌): రాజీ మార్గమే లోక్‌అదాలత్‌ లక్ష్యమని, కక్షిదారులు రాజీపడి వస్తే లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జి.శ్రీనివాస్‌ అన్నా రు. నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని శ్రీనివాస్‌ ప్రారంభించి మాట్లాడారు. జాతీయ లోక్‌అదాలత్‌లో కేసును రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపా రు. ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ రాజీ మార్గంతో ఇరుపక్షాలకు స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జాతీ య లోక్‌అదాలత్‌లో 66,376 కేసులు పరిష్కారం కా గా, లబ్ధిదారులకు రూ. 10,39,34,942 పరిహారం చెల్లించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. న్యాయమూర్తులు ఎల్‌.తేజోవతి, కె.శ్రీనివాస్‌, ఎంఏ సోమశేఖర్‌, సిరిపిరెడ్డి సుమ, కరుణాకర్‌, ఎస్‌. శ్రీనివా స్‌, శారదరెడ్డి, ఎస్‌కే నిషాద్‌నాజ్‌ ప్రిసైడింగ్‌ అధికారు లుగా వ్యవహరించి 32,916 కేసులు పరిష్కరించారు. పలు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అయ్యపరెడ్డి, పోలీస్‌, బీమా, బ్యాంకు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వాణి జిల్లావ్యాప్తంగా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement