గంజాయి విక్రయదారులపై చర్యలకు డిమాండ్
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్‌బీ డిమాండ్ చేశారు. అశ్లీలతను అరికట్టాలని ఐద్వా జిల్లా కమిటీ వారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అజిత వేజండ్లకు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నటుడు చంద్రహాస్ ఓ సినిమా ప్రమోషన్‌లో పాడిన పాట అత్యంత నీచమైందన్నారు. సెన్సార్ బోర్డు తొలగించిన పాటను పాడటం చట్టధిక్కారమే కాక అశ్లీలతను పెంచిపోషించడమే అన్నారు. అనేక జిల్లాల్లో అశ్లీల నృత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. హోంశాఖ మంత్రి మహిళ అయినప్పటికి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు అవసరమైన ప్రచారంతోపాటుగా డీ అడిక్షన్ కేంద్రాలను పునరుద్ధరించాలని కోరారు. కోరారు. కార్యక్రమంలో ఐద్వాకు చెందిన అరిగెల రమమ్మ, వరలక్ష్మి, ఎన్.ఆదిలక్ష్మి, ఈ.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వీఎస్‌యూలో ఐఎస్‌ఓ బృందం తనిఖీలు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో ఐఎస్‌ఓ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించింది. అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతినిధులైన రిటైర్డ్ న్యాయమూర్తి టి.సుందర్‌రామయ్య, హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య, ఐఎస్‌ఓ ఆడిటర్లు టి.సుమాదేవి తదితరులు వర్సిటీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి రిజిస్ట్రార్, ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాణ్యతా విధానాలు, అంతర్గత ఆడిట్ ప్రక్రియ, అకడమిక్ ప్రణాళికలు, పరిపాలనా పారదర్శకత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అంగన్‌వాడీల ఆందోళనబాట
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అంగన్‌వాడీలు ఆందోళనబాట పట్టారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, సీడీపీఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. సంవత్సరాల తరబడి తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదంటూ సీఐటీయూ నాయకులు అన్నారు. వారంరోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గంజాయి విక్రయదారులపై చర్యలకు డిమాండ్
గంజాయి విక్రయదారులపై చర్యలకు డిమాండ్


