యువకుడిపై పోక్సో కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై పోక్సో కేసు నమోదు

Feb 24 2026 6:59 AM | Updated on Feb 24 2026 6:59 AM

యువకు

యువకుడిపై పోక్సో కేసు నమోదు

సంగం: ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన యువకుడిపై సోమవారం సంగం పోలీసులు కిడ్నాప్‌, పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు..కొడవలూరు మండలం రాజుపాళేనికి చెందిన రోహిత్‌కుమార్‌ వివాహితుడు. ఈ నెల 21న సంగంలోని ఓ కళాశాలలో చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి బుచ్చిరెడ్డిపాళెం రిజర్వాయర్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడుతుండగా సమాచారం అందుకున్న సంగం పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రోహిత్‌ కుమార్‌పై కిడ్నాప్‌, పోక్సో కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నేతపై

టీడీపీ మూకల దాడి

వెంకటాచలం: వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళేనికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఉప్పు రాఘవేంద్రపై టీడీపీ కార్యకర్తలు దారి కాచి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. బాధితుడి సమాచారం మేరకు.. రాఘవేంద్ర తన పొలాల్లోకి వెళ్లి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు తురకా కల్యాణ్‌, గిరి, కే అశోక్‌, జగదీష్‌, అజయ్‌కుమార్‌, వెంకటరమణయ్య మరికొందరు కాపు కాచి మాకుమ్ముడిగా దాడి చేసి పరారయ్యారు. కొద్ది సేపటికి తేరుకున్న రాఘవేంద్ర దాడి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పాల విక్రయ

కేంద్రాల్లో తనిఖీలు

నెల్లూరు(అర్బన్‌): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత ఆదేశాల మేరకు వైద్యాఆరోగ్యశాఖ అధికారులు ఫుడ్‌సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని పాల విక్రయ కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాగుంట లేఅవుట్‌, రాంజీనగర్‌, వేదాయపాళెం, చిల్డ్ర న్స్‌పార్కు, తదితర ప్రాంతాల్లోని పాల విక్రయ కేంద్రాలపై దాలు నిర్వహించి పాల నమూనాలు సేకరించారు. ప్రతి ఏరియాలో పాలు అమ్ముతు న్న వారి నుంచి ఒక శాంపిల్‌, కొనుగోలు చేసిన వారి నుంచి మరో శాంపిల్‌ను సేకరించి ల్యాబొరేటరీలకు పంపారు. విడిపాలు అమ్ముతున్న నలుగురికి నోటీసులు సైతం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాఆరోగ్య శాఖ సర్వైలెన్సు అధికారి డాక్టర్‌ భాస్కర్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ప్రనూతి ఫ్లోరా, నీరజ మాట్లాడుతూ కల్తీ పాలతో పసిబిడ్డల నుంచి పెద్ద వారి వరకు వరకు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. లైసెన్సులు లేకుండా విడిగా పాలకేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయాలు సాగించడం చట్టరీత్యా నేరమన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బాలికను గర్భిణిని

చేసి పెళ్లికి నిరాకరణ

బాలుడిపై పోక్సో కేసు నమోదు

ఉదయగిరి: బాలికను పెళ్లి చేసుకుంటానని నిమ్మించి శారీరకంగా అనుభవించి గర్భిణిని చేసిన బాలుడిపై ఉదయగిరి పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు..పట్టణానికి చెందిన ఓ బాలుడు, బాలిక స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ కళశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వీరికి గతేడాది పరిచయమైంది. ఈ నేపథ్యంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలుడు శారీరకంగా అనుభవించి గర్భిణిని చేశాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మైనర్‌ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

యువకుడిపై  పోక్సో కేసు నమోదు 
1
1/1

యువకుడిపై పోక్సో కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement