ప్రజల ప్రాణాలను కాపాడాలి
మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ కోరారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిరాజ్ మాట్లాడుతూ పేషెంట్ హాస్పిటల్‌కు వెళ్తే వ్యాధి గురించి అడగకుండా ఏ కంపెనీ నుంచి ఆరోగ్య బీమా ఉందని అడిగి వైద్యం చేయడం సిగ్గుచేటన్నారు. సేవాభావంతో వైద్యం అందిస్తున్న డాక్టర్లను తమ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. జనరిక్ మందులు ప్రజలకు దొరకని పరిస్థితి ఉందన్నారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఈనెల 28వ తేదీన డ్రగ్స్ కంట్రోల్ అధికారుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద పోరాటానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగంలోని వైద్యశాలలను విస్తరించాలని, ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించి కోరారు. నేతలు యామాల మధు, నందిపోగు రమణయ్య, షాన్‌వాజ్, లీలామోహన్, అజీజ్, అహ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


