పోటెత్తిన అర్జీదారులు
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● వినతులు స్వీకరించిన అధికారులు
నెల్లూరు(దర్గామిట్ట): నగరంలోని కలెక్టరేట్‌కు అర్జీదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి అనేకమంది విచ్చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
● భూ సమస్యపై వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన సన్నారెడ్డి మాధవి అర్జీ ఇచ్చారు.
● కొత్త వంగల్లు సచివాలయ వీఆర్వో ప్రసాద్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు వినతిపత్రం సమర్పించారు. కులధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం నగదు డిమాండ్ చేస్తున్నారని, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.
పింఛన్ కోసం..
మూడేళ్లుగా వితంతు పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా. అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో మంజూరు కావడం లేదు. అధికారులు పింఛన్ మంజూరు చేయించాలి.
– తోటకూర మల్లీశ్వరి, మూలాపేట
పోటెత్తిన అర్జీదారులు
పోటెత్తిన అర్జీదారులు


