ప్రజల్ని కాదని.. ఫోన్‌ చూసుకుంటూ.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల్ని కాదని.. ఫోన్‌ చూసుకుంటూ..

Feb 24 2026 7:00 AM | Updated on Feb 24 2026 7:00 AM

ప్రజల్ని కాదని.. ఫోన్‌ చూసుకుంటూ..

ప్రజల్ని కాదని.. ఫోన్‌ చూసుకుంటూ..

నెల్లూరు(దర్గామిట్ట): ప్రజల కష్టాలను తీర్చాల్సిన వేదిక అది. ఉన్నతాధికారులు ఒక్కో అర్జీని పరిశీలిస్తూ బాధితులకు భరోసా ఇస్తుంటే.. అదే వేదికపై ఉన్న మరో అధికారి తీరు మాత్రం విమర్శలకు తావిచ్చింది. తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తదితరులు వినతులు స్వీకరించారు. సమస్యలను ఆలకించేందుకు వేదికపై ఆశీనులైన జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి మాత్రం కార్యక్రమం జరుగుతున్నంత సేపు సెల్‌ఫోన్‌ చూసుకుంటూ కాలక్షేపం చేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం అర్జీదారులను విస్మయానికి గురిచేసింది. జిల్లా యంత్రాంగం ప్రజల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్‌ చెబుతున్నా కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు కలెక్టరేట్‌ వర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement