
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
పరేడ్ గ్రౌండ్‌లో చేసిన ఏర్పాట్లు
కవాతు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు(క్రైమ్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం సిద్ధమైంది. పోలీస్ వందనం స్వీకరణ, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గురువారం ఎస్పీ జి.కృష్ణకాంత్ సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. కవాతు రిహార్సల్స్‌ను పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలిచ్చారు. శుక్రవారం జెండా వందనానికి విచ్చేసే ముఖ్యఅతిథులకు గౌరవార్థం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరిని డీఎంఎఫ్‌డీ ద్వారా తనిఖీ చేయాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్‌బీ, ఏఆర్ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, ఎస్.చంద్రమోహన్, ఆర్‌ఐలు అంకమరావు, రాజారావు, హరిబాబు, పౌల్‌రాజు, శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు