
చీకటి జీఓలు రద్దు చేయాలంటూ..
నెల్లూరు(టౌన్): ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీఓలను రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ డిమాండ్ చేశారు. బుధవారం వీఆర్సీ సెంటర్‌లో జీఓలను రద్దు చేయాలంటూ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏడాదిగా విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జీఓను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షారూఖ్, ఆశిర్, ఖాదర్ మస్తాన్, నవీన్, చరణ్, వంశీ పాల్గొన్నారు.