
మద్యం కేసులో కాకాణికి బెయిల్ మంజూరు
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఇందుకూరుపేట ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 4వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్‌దారుల పూచీ కత్తు, రూ.25 వేలు, వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎకై ్సజ్ అధికారుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాకాణిపై ఆరోపణలకు ఎలాంటి ప్రాథ మిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో 8వ నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించారు. అనంతరం ఇందుకూరుపేట ఎకై ్సజ్ అధికారుల తరఫున ఏపీపీ లీలాకుమారి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ బదిలీ
నెల్లూరు (లీగల్): నెల్లూరు రైల్వే కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పాలమంగళం వినోద్‌ను కర్నూలు జిల్లా డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తు తం నెల్లూరు రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ వినోద్ ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్నా రు. ట్రైనింగ్ తర్వాత డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు తీసుకొంటారు.
పోలీస్ కస్టడీకి బిరదవోలు
నెల్లూరు (లీగల్): వైఎస్సార్‌సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని విచారణ నిమిత్తం మూడు రోజు లు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్.సరస్వతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో అక్రమ మైనింగ్ చేసినట్లు పొదలకూ రు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన్ను విచారించడానికి నెల్లూరు రూరల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్నారని విచారించ డానికి 7 రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు. బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యా యవాది కె.రాజశేఖర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్‌రెడ్డిని ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తీసుకోవాలని, 14వ తేదీ విచారణాంతరం సా యంత్రం ఐదు గంటలకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచాలన్నారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని, న్యాయవాది సమక్షంలో ఆయన్ను విచారణ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.