అక్రమ కేసుల్లో అరెస్ట్‌లకు అత్యుత్సాహం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసుల్లో అరెస్ట్‌లకు అత్యుత్సాహం

Aug 11 2025 7:23 AM | Updated on Aug 11 2025 7:23 AM

అక్రమ కేసుల్లో అరెస్ట్‌లకు అత్యుత్సాహం

అక్రమ కేసుల్లో అరెస్ట్‌లకు అత్యుత్సాహం

సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల ఆదేశాలతో వైఎస్సార్‌సీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన దర్గామిట్ట పోలీసులు ఇరకాటంలో పడ్డారు. పోలీసులుగా తమ విధులు వదిలేసి పచ్చ పార్టీకి విదేయులుగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. లాఠీచార్జి ఘటనలో పోలీసుల దుందుడుకుగా వ్యవహరించడంతో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ పక్కకు తప్పుకునే క్రమంలో ఆయనకై ఆయనే తట్టుకుని కింద పడిపోయాడు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల పాత్ర ఏమాత్రం లేదు. పోలీసులు నమోదు చేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడేమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫొటోలను న్యాయమూర్తి ముందు పెడితే పోలీసులపైనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయకోవిదులు చెబుతున్నారు.

అడ్డుగోలుగా కేసులు

ఘటనకు దారితీసిన పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పటికీ ఇవేమి తమకు పట్టవంటూ కూటమి నేతలు సూచించిన పేర్లను కేసుల్లో ఇరికించి పోలీసులు జైలుకు పంపుతున్నారు. ఇటీవల కావలి ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ చేయి విరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. హెడ్‌కానిస్టేబుల్‌ ఫొటోలు తీస్తూ తనకు తాను తట్టుకుని కింద పడితే వైఎస్సార్‌సీపీ నేతలు నెట్టివేయడంతో కింద పడ్డానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాస్తవాలు పరిశీలించకుండానే ఎస్‌బీహెడ్‌కానిస్టేబుల్‌ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆయన్ను నెట్టివేయడంతో కిందపడి చేయి విరిగిందంటూ నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్లతో తొలుత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు కౌన్సిలర్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్‌, పాతపాటి ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత కూటమి నేతలు ఇచ్చిన జాబితా ప్రకారం వైఎస్సార్‌సీపీ కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనురూప్‌రెడ్డితోపాటు 17 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారు. 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు మరికొందరుపై మరో కేసు నమోదు చేశారు. బైక్‌ ర్యాలీ చేశారని యువకులపై ఇంకో కేసు నమోదు చేశారు.

ముందు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉంటే.. వెనుక పక్కన కిందపడిన హెడ్‌కానిస్టేబుల్‌ (వృత్తాల్లో చూడొచ్చు)

పోలీసుల తోపులాటలో పడిన హెచ్‌సీ, మరో వ్యక్తి

ఇద్దరు కూటమి ఎమ్మెల్యేల ఆదేశాలతో ఈ కేసులో మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు 20 మందిని నిందితులుగా చేర్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌తోపాటు చైన్నె, బెంగళూరు, వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కోవూరు మండల అధ్యక్షుడు ఎ. అనూప్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన తీరును చూస్తే దర్గామిట్ట పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోంది. ఆయనేమి ఉగ్రవాది కాదు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తి ఇంటిని అర్ధరాత్రి పూట భారీగా పోలీసులు చుట్టుముట్టి భయానక వాతావరణం సృష్టించడం చూస్తే పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఆయన్ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. మరికొందరి కోసం వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. వాస్తవానికి తమకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నప్పటికి పోలీసులు అవేమిపట్టించుకోకుండా కూటమి పెద్దలను మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ పర్యటన సక్సెస్‌తో

జీర్ణించుకోలేని కూటమి నేతలు

తోపులాటలో హెడ్‌కానిస్టేబుల్‌ గాయపడ్డాడని 20 మందిపై అక్రమ కేసులు

ఇప్పటికే కోవూరు మండల కన్వీనర్‌ అనూప్‌రెడ్డి అరెస్ట్‌

మరికొందరి కోసం హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో

ప్రత్యేక బృందాల గాలింపు

వెలుగులోకి వచ్చిన ఆయనకై ఆయనే తట్టుకుని పడిన చిత్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement