
నిమ్మ ధరలు ౖపైపెకి..
నిమ్మ ధరలు పెరిగాయని సంతోష పడాలా?, దిగుబడి లేనందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో రైతులున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో ఇటీవల స్వల్పంగా ధరలు పెరిగాయి. తాజాగా అమాంతం ఒక కిలో రూ.30 నుంచి రూ.50కి చేరింది. బస్తా కాయలు ప్రస్తుతం మార్కెట్లో రూ.4 వేలకు అమ్ముతున్నారు. నెలాఖరుకు ధరలు మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది.
బస్తా కాయలు రూ.4 వేలు
● ధరలు మరింత పెరిగే అవకాశం
● బయట మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్
● దిగుబడి తగ్గి రైతుల దిగాలు
పొదలకూరు: ఈ ఏడాది నిమ్మ మార్కెట్ సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. ధరలు పతనమై కిలో కాయలు రూ.15కు కూడా అమ్ముడుపోలేదు. చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలిలేయాల్సి వచ్చింది. అయితే పండగల సీజన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా ధరలు తాత్కాలికంగా ఉంటాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ నుంచి వర్షాలు మొదలైతే కాయల ఎగుమతి పూర్తిగా తగ్గిపోతుంది. కాగా దసరా వరకు రైతులకు నష్టం వాటిల్లకుండా ధరలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు.
సంక్షోభం నుంచి కోలుకుంటూ..
ఈ ఏడాది సీజన్‌లో సైతం ధరలున్నా కాయల్లేక, ఒకవేళ కాయలుంటే ధరల్లేక రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరేళ్ల నాడు ఇలాంటి పరిస్థితే వచ్చింది. వ్యాపారులు కొనుగోలు చేసిన కాయలను పారబోసేవారు. గతేడాది ఇదే సీజన్లో బస్తా రూ.9 వేల వరకు అమ్ముడుపోయింది. కాయలు ఉన్నన్ని రోజులు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. తీరా తోటల్లో కాయలు లేకపోవడంతో ఇప్పుడు డిమాండ్ మెల్లగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఉండదని రైతులు చెబుతున్న మాట. చాలామంది తోటల్లో కాయలు పలచబారి లేకుండాపోతున్నాయి. కాయలున్న ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఈ ప్రాంతంలో 4 వేల ఎకరాల్లో తోటలన్నాయి. నిమ్మను మెట్టరైతులను వేరుచేసి చూడలేని పరిస్థితి ఉంది. ఎన్ని కష్టా లు, నష్టాలొచ్చినా ఈ సాగును వీడటం లేదు.
మార్కెట్‌కు వచ్చిన నిమ్మకాయలు
ధరలు పెరగడం మంచిదే..
ధరలు పెరగడం మంచి పరిణామమే. అయితే నెలరోజులు ముందుగా పెరిగుంటే చాలామంది రైతులు బాగుపడేవారు. తోటల్లో కాయలు లేని తర్వాత పెరగడం వల్ల తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కాయలున్న రైతులకు ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది.
– పి.పెంచలనారాయణరెడ్డి,
నిమ్మ రైతు, మొగళ్లూరు
ఆటుపోట్లు మామూలే..
ఈ ప్రాంత నిమ్మ రైతులకు ధరల్లో ఆటుపోట్లు మామూలైపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా నిమ్మను వీడలేం. ఒక ఏడాది ఆదాయం వస్తే మరో ఏడాది నష్టం వస్తుంటుంది. అంతమాత్రాన సాగును వదిలిపెట్టేది ఉండదు. నిమ్మలోనే జీవించడం వల్ల మాకు నష్టం వచ్చినా పట్టించుకోం.
– కేపీ నారాయణరెడ్డి, నిమ్మ రైతు, అంకుపల్లి
ఢిల్లీ మార్కెట్‌కు పంపుతున్నాం
మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారంలో వేగం పెరిగింది. అయితే తోటల్లో కాయలు తగ్గుముఖం పడుతున్నందునే ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇటీవల వరకు ఆ మార్కెట్ వ్యాపారులు కాయలను వద్దనేవారు. ఇప్పుడు కావాలంటున్నా కాయలు తగినన్ని లేకపోవడంతో ఉన్నవాటినే పంపుతున్నాం.
– ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మ మార్కెట్, పొదలకూరు
●

నిమ్మ ధరలు ౖపైపెకి..

నిమ్మ ధరలు ౖపైపెకి..

నిమ్మ ధరలు ౖపైపెకి..