
13న ప్రత్యేక విద్యుత్ అదాలత్
● ఈఈ సోమశేఖర్‌రెడ్డి వెల్లడి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఈనెల 13వ తేదీ బుధవారం పొదలకూరులో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ నెల్లూరు రూరల్ డివిజన్ ఈఈ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్‌లో ఉన్న కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రూరల్ డివిజన్ పరిధిలోని రాపూరు, నెల్లూరు రూరల్, పొదలకూరు, ముత్తుకూరు సబ్ డివిజన్ పరిధిలోని రాపూరు, సైదాపురం, పొదలకూరు, మనుబోలు, కలువాయి, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలతోపాటు విరుపూరు, కోడూరు, వెంకటాచలం, కావేరినగర్, బుజబుజనెల్లూరు, నారాయణరెడ్డిపేట సెక్షన్ల విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈ అదాలత్ జరుగుతుందన్నారు. పొదలకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, సభ్యురాలు విజయలక్ష్మి, ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ విజయన్, డిస్కం అధికారులు విచ్చేస్తారన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగదారలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.