
కరాటే పోటీల్లో బంగారు పతకం
కలిగిరి: మండలంలోని బసిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన బోరెడ్డి సరిత తంజావూరులో నిర్వహించిన మూడో ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్‌షి ప్ – 2025లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచింది. పెరియార్ మణియమ్మై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆండ్ కళాశాల ఆవరణలో ‘కింగ్ షిటో – ర్యూ స్పోర్ట్స్ కరాటే డో ఇండియా’ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఇంటర్నేషనల్ పోటీలు జరిగాయి. మొదటి స్థానంలో నిలిచిన సరితకు నేషనల్ కరాటే ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సినీ నటుడు సుమన్, జాతీయ కార్యదర్శి డాక్టర్ పియూ ష్‌జైన్ బంగారు పతకం, ట్రోఫీ అందజేశారు. తనకు శిక్షణ ఇచ్చిన లక్ష్మీసామ్రాజ్యం, రవికి సరిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.