
లులు సంస్థతో లాలూచీలు ఆపండి
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ అయిన లులుకు రూ.400 కోట్లు విలువ చేసే స్థలాన్ని కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ ప్రాంగణంలోని ఆ యూనియన్ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. నారాయణరావు, జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్ మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న గవర్నర్‌పేట–1, 2 డిపోలకు సంబంధించిన రూ.400 కోట్లు విలువ చేసే స్థలాలను 99 ఏళ్లకు తక్కువ లీజుకు లులు సంస్థకు కట్టబట్టడాన్ని తప్పుపట్టారు. లీజుకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 174 జీఓను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రటరీ బీ మాలాద్రి, జిల్లా ప్రచార కార్యదర్శి వీఎస్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ వెంకటేశ్వర్లు, నానో ఆపరేషన్ నాయకులు ఎం పాపయ్య, రాష్ట్ర మెయింటినెన్స్ కమిటీ సభ్యులు అశోక్‌కుమార్, నెల్లూరు–1 డిపో అధ్యక్షుడు మల్లికార్జున, కార్యదర్శి ఎం.పెంచలయ్య, నెల్లూరు–2 డిపో కార్యదర్శి కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రూ.400 కోట్ల స్థలాన్ని కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలి
ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు