
డిమాండ్ ఉంటుంది
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోంది. ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నాం. అంతర పంటల సాగుకు ఎకరాకు రూ.5,200 చొప్పున నాలుగేళ్లపాటు ఇస్తున్నాం. వింజమూరు, దుత్తలూరు మండల కేంద్రాలల్లో గెలల సేకరణ కేంద్రం ఉంది. త్వరలో కలిగిరి మండలం కొత్తపేటలో మూతబడిన ఫ్యాక్టరీని పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్ట ప్రాంత రైతులకు ఆయిల్‌పామ్ సాగు లాభాలు కురిపిస్తోంది. మన దేశంలో ఎప్పుడూ పామాయిల్‌కు డిమాండ్ ఉంటుంది. అందువల్ల ధరలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– జయశ్రీ, ఉద్యానాధికారిణి, ఉదయగిరి