
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు
● బోగీల్లోంచి దూకేసిన ప్రయాణికులు
మనుబోలు: బిహార్‌లోని చాప్రా నుంచి చైన్నె వెళ్తున్న గంగా కావేరి (నంబరు 12670) ఎక్స్‌ప్రెస్ రైల్లో బ్రేక్ బైండింగ్ కారణంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమై రైలు ఆపడంతో ప్రయాణికులు బోగీల్లోంచి దిగేశారు. ఈ ఘటన మనుబోలు సమీపంలో రైల్వే ట్రాక్‌పై శుక్రవారం జరిగింది. రైలు మనుబోలు చెరువు సమీపంలోకి వచ్చే సరికి ఇంజిన్ వెనుక బోగీ కింద నుంచి భారీగా పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ ఆపారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు అర్ధగంట పాటు రైలు ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం రైలు చైన్నె బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ప్రయాణికులు నడుచుకుంటూ కాగితాలపూరు క్రాస్‌రోడ్డు, మనుబోలుకు చేరుకుని గమ్యస్థానాలకు వెళ్లారు.
ఉత్సాహంగా
క్రీడాకారుల ఎంపిక
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎంపికల్లో క్రీడాకారులు ఉత్సాహంగా హాజరయ్యారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండో రోజు శుక్రవారం బాస్కెట్ బాల్, ఖోఖో, హాకీ, వాలీబాల్ క్రీడాంశాల్లో 22 ఏళ్ల లోపు సీ్త్ర, పురుషుల క్రీడా జట్ల ఎంపికలకు 305 మంది క్రీడాకారులు హాజరయ్యారని డీఎస్‌డీఓ ఆర్‌కే యతిరాజ్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు బ్యాడ్మింటన్ క్రీడాంశంలో క్రీడా పోటీలు, జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించనున్నామన్నారు.
190 బస్తాల
రేషన్ బియ్యం పట్టివేత
● సివిల్ సప్లయీస్, పోలీసుల సంయుక్త తనిఖీ
కోవూరు: నెల్లూరు– ముంబై జాతీయ రహదారిలో ఆత్మకూరు వైపు నుంచి కోవూరు వైపు వెళ్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 190 బస్తాల రేషన్ బియ్యాన్ని సాలుచింతల వద్ద సివిల్ సప్లయీస్, పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అనంతసాగరం నుంచి కోవూరు మండలంలోని ఒక రైస్ మిల్లుకు ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచా రం రావడంతో సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ బాలకోటమ్మ, కోవూరు ఎస్సై రంగనాథ్‌గౌడ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తనిఖీ లు చేపట్టారు. ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యంతోసహా వాహ నాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు.

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు

గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు