
జల్‌జీవన్ మిషన్ పథకం శిలాఫలకం ధ్వంసం
కావలి (జలదంకి): కావలి మండలం తుమ్మలపెంటలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకం నిర్మాణానికి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.33 కోట్ల నిధులతో జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో పథకానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొంతమేర పనులు జరిగాయి. తర్వాత ఎన్నికలు రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి. అయితే శిలాఫలకంలో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకుల పేర్లు ఉన్నాయి. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు శిలాఫలకాన్ని రాత్రికి రాత్రి కూల్చి వేశారని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.

జల్‌జీవన్ మిషన్ పథకం శిలాఫలకం ధ్వంసం