
18,870 బంగారు కుటుంబాల ఎంపిక
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(అర్బన్): ీప–4 కింద జిల్లాలో 18,870 బంగారు కుటుంబాలను, సుమారు 5 వేల మంది మార్గదర్శిలను ఎంపిక చేశామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి పీ–4 కార్యక్రమంపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాలు నుంచి జేసీ కార్తీక్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సీఎస్ అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల నిరుపేద కుటుంబాలను ఈనెల 15వ తేదీలోగా ఎంపిక చేసి ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో హుస్సేన్ సాహెబ్, సీపీఓ నరసింహారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి, పరిశ్రమల శాఖ జీఎం మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.