
ఒక్క రాత్రిలోనే..
● సీజ్ చేసిన మైన్ నుంచి
వైట్ క్వార్ట్ ్జ తరలింపు
● రెవెన్యూ అధికారులకు సమాచారం
● దీంతో ఆగిన తంతు
పొదలకూరు: సీజ్ చేసిన అటవీ భూముల్లోని వైట్ క్వార్ట్ ్జను గుర్తుతెలియని వ్యక్తులు నాలుగురోజుల క్రితం రాత్రివేళ టిప్పర్లలో తరలించారు. ఈ ఖనిజానికి డిమాండ్ ఉంది. ఇక్కడ నాణ్యమైంది లభ్యమవుతుండటంతో జేసీబీతో నాలుగు టిప్పర్లలో లోడ్ చేసి తరలించారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు తెలియడంతో తిరిగి రాయిని తరలించే ప్రయత్నాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది.
గతంలో మండలంలోని మొగళ్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూముల్లో మైనింగ్ చేస్తుండగా అధికారులు దాడులు నిర్వహించారు. వెలికి తీసిన రాయితోపాటు, మైన్‌ను సీజ్ చేశారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ మైన్‌పై కేసులు కూడా నడుస్తున్నాయి. మైనింగ్ అధికారులు అప్పట్లో నోటీసులను సైతం అందజేశారు. అయితే మైనింగ్‌కు అలవాటు పడిన గూడూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి నాణ్యత కలిగిన రాయిని వదులుకునేందుకు ఇష్టం లేక కొంతకాలంగా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా ఎవరూ సహకరించకపోవడంతో ఆ వ్యక్తి సాహసించలేకపోయాడు. నాలుగురోజుల క్రితం కొందరు ముందుకురావడంతో ఒక్క రాత్రే ట్రెంచ్ కొట్టిన మైన్ వద్దనున్న రాయిని తరలించాడు. ఆరోజు రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో కాపలా ఉన్న వారు ఇళ్లకు వెళ్లడంతో క్వార్ట్ ్జను తరలించేందుకు అనుకూలంగా మారినట్టు తెలిసింది. మరుసటిరోజు సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మైన్ వద్ద కాపలాను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
నిఘా పెంచాం
వైట్ క్వార్ట్ ్జను గుర్తుతెలియని వ్యక్తులు తరలించినట్టు సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో నిఘా పెంచాం. తలారులను రాత్రి వేళ కూడా కాపలా ఉండాలని ఆదేశించాం. మైనింగ్ అధికారులకు సమాచారం అందజేయడం జరుగుతుంది.
– బి.శివకృష్ణయ్య,
తహసీల్దార్, పొదలకూరు