
బాలుడి అదృశ్యం.. డ్రోన్‌తో వెతుకులాట
నెల్లూరు సిటీ: ఒకటో తరగతి చదువుతున్న బాలుడు అదృశ్యమవగా ఏడుగంటల్లోనే పోలీసులు ఆచూకీ కనుకున్నారు. వారి కథనం మేరకు.. రూరల్ మండలంలోని పాతవెల్లంటి గ్రామంలో పాదర్తి నారాయణ, రమణమ్మ దంపతులకు మనోజ్ అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం కుమారుడు అల్లరి చేస్తున్నాడని తండ్రి మందలించాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి పనిలో వారుండగా మనోజ్ వీధిలోకి వెళ్లాడు. ఆడుకోవడానికి వెళ్లి ఉంటాడని తొలుత భార్యాభర్తలు భావించారు. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి వెతకడం మొదలుపెట్టా రు. డ్రోన్‌ను ఉపయోగించి ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. పక్కవీధిలోని ఇంటి మిద్దైపె ఉన్నట్లు గుర్తించారు. మనోజ్ డ్రోన్‌ను చూసి ఆ శబ్దానికి కిందకు దిగాడు. ఆచూకీ లభ్యం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.