
బీసీజీ వ్యాక్సిన్‌తో టీబీని నివారిద్దాం
నెల్లూరు(వేదాయపాళెం): బీసీజీ టీకా ద్వారా జిల్లాలో టీబీని నివారిద్దామని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ తెలిపారు. నగరంలోని రాజరాజేశ్వరి గుడి సమీపంలో గల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ జిల్లా కార్యాలయంలో అర్హులకు బీసీజీ టీకాలను వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ పెంచలయ్య మాట్లాడారు. షుగర్ వ్యాధిగ్రస్తులు.. 60 ఏళ్లు పైబడిన వారు.. ఇలా ఆరు కేటగిరీలకు చెందిన వ్యక్తులకు టీకాలను వేస్తున్నామని వివరించారు. టీకాలను అర్హులు విధిగా వేయించుకోవాలని కోరారు. అనంతరం పలువురు అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు టీకాలు వేశారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, రాష్ట్ర పరిశీలకుడు శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.