రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీరసింహస్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీన జ్యేష్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. జ్యేష్ట మాసంలో జ్యేష్టా నక్షత్రం, పౌర్ణమి ఒకేరోజు వచ్చిన సందర్భంగా వైష్ణవాలయాల్లో హోమం, అభిషేకాలు నిర్వహంచడం ఆచారమన్నారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవ, నరసింహ హోమం, 10 గంటలకు శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో స్నపన పీఠంపై నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి 81 కలశాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు.