రక్తదానం వల్ల శరీరం నీరసించి పోతుంది. బలహీనపడుతుంది. శక్తి తగ్గుతుందనే ప్రచారముంది. ఇవన్నీ అపోహలని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతి మనిషి శరీరంలోని రక్తకణ జీవిత కాలం సుమారు 120 రోజులు. తర్వాత పాత రక్తకణాలు నశించి కొత్త రక్తకణాలు ఏర్పడుతాయి. అందువల్ల ఆరోగ్యవంతమైన 18 నుంచి 60 ఏళ్లలోపు పురుషులు ప్రతి మూడు నెలలకోమారు, సీ్త్రలు ప్రతి ఆరునెలలకు ఒక దఫా నిరభ్యంతరంగా రక్తదానం చేయొచ్చు. కాగా చెడు అలవాట్లు ఉన్నవారు, హెపటైటిస్ బీ, సీ ఉన్న వారు, హెచ్‌ఐవీ సోకిన వారు అధిక బీపీ ఉన్న వారు, కేన్సర్ లాంటి జబ్బులకు గురైన వారు రక్తదానం చేయకూడదు.