
పార్టీలో చేరిన వారితో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: మండలంలోని తాటిపర్తి పంచాయతీ బత్తులపల్లిపాడు (ఆనాటికండ్రిక)లో మూడు దశాబ్దాలుగా సీపీఎంలో క్రియాశీలకంగా కొనసాగుతున్న నేతలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. సీపీఎం మండల స్థాయి నేత పలుకూరు దశరథరామిరెడ్డి, మరో 50 కుటుంబాలకు చెందిన ఆయన అనుచరులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతరం మంత్రి మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సర్వేపల్లి నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై టీడీపీ నుంచే కాకుండా ఇతర పార్టీల వారు తమ పార్టీలో చేరుతున్నారని వివరించారు. వీరికి సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలిపారు. రామస్వామి, రవి, పెంచలయ్య, వసంతకుమార్ తదితరులు పార్టీలో చేరారు. సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, పలుకూరు పోలిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.