పసిడి పతకం ముద్దాడిన సుచిత్ర అకాడమీ స్టార్లు | YONEX- SUNRISE ALL INDIA SUB JUNIOR CHAMPIONSHIP UNDER-15 HYDERABAD | Sakshi
Sakshi News home page

పసిడి పతకం ముద్దాడిన సుచిత్ర అకాడమీ స్టార్లు

Jun 7 2026 5:39 PM | Updated on Jun 7 2026 6:13 PM

YONEX- SUNRISE ALL INDIA SUB JUNIOR CHAMPIONSHIP UNDER-15 HYDERABAD

హైదరాబాద్ వేదికగా యోనెక్స్-సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (U-15) నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో సరికొత్త ఛాంపియన్లు అవతరించారు. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన కిమ్‌కిమ్ ఖోంగ్‌సాయి, లియాన్‌సాంగ్‌పుయా జోడి మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో పసిడి పతకం కైవసం చేసుకున్నారు.

ఫైన‌ల్‌లో ప్ర‌త్య‌ర్ధిపై 21-10, 21-15 వరుస సెట్లలో గెలిచి ఛాంపియ‌న్స్‌గా నిలిచారు. అంత‌కుముందు సెమీఫైన‌ల్లో టోర్నీ రెండువ సీడ్ జోడీపై వీరిద్ద‌రూ ఘ‌న విజ‌యం సాధించారు. కాగా కిమ్‌కిమ్ ఖోంగ్‌సాయి, లియాన్‌సాంగ్‌పుయా ఇద్దరూ మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు.

వారిద్ద‌రికి 'సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ'లో చేరకముందు కనీసం రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లు కూడా అనుభవం లేదు.  వారిని చిన్న వయసులోనే హైదరాబాద్ తీసుకొచ్చి, అకాడమీ తరపున డైరెక్టర్  కె. ప్రదీప్ రాజు ఉచిత కోచింగ్ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement