అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్‌పై జైశ్వాల్ ఫైర్‌! వీడియో వైర‌ల్‌ | Yashasvi Stands Ground After Being Given Out, Expresses Displeasure | Sakshi
Sakshi News home page

IND vs ENG: అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్‌పై జైశ్వాల్ ఫైర్‌! వీడియో వైర‌ల్‌

Jun 7 2025 1:44 PM | Updated on Jun 7 2025 3:16 PM

Yashasvi Stands Ground After Being Given Out, Expresses Displeasure

నార్తంప్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న రెండో అనాధికారిక  భార‌త్‌-ఎ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 17ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి జైశ్వాల్ ప్యాడ్‌కు తాకింది. వెంట‌నే కీప‌ర్‌తో పాటు బౌల‌ర్ ఎల్బీకి అప్పీల్ చేయ‌గా అంపైర్ వెంట‌నే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్ర‌మంలో అంపైర్ నిర్ణ‌యం ప‌ట్ల జైశ్వాల్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. 

జైస్వాల్ కొన్ని సెకన్ల పాటు క్రీజులోనే నిలబడి అలా షాక్‌లో ఉండిపోయాడు. బంతి స్టంప్స్‌ను మిస్స్ అవుతుంది, ఎలా ఔట్ ఇస్తావు అన్నట్లు అంపైర్ వైపు చూస్తూ జైశ్వాల్ సైగ చేశాడు. అయితే ఈ అనధికారిక టెస్ట్‌లో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడంతో, జైశ్వాల్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

శత​క్కొట్టిన రాహుల్‌..
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్‌ (168 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో విజృంభించాడు.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా... జట్టులో అందరికంటే సీనియ‌ర్‌ రాహుల్‌కు ఈ మ్యాచ్‌ ద్వారా చక్కటి ప్రాక్టీస్‌ లభించింది. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’జట్టు 83 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. 

భారత బ్యాటర్లలో రాహుల్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన కరుణ్‌ నాయర్‌ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
చదవండి: రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

 

 

Advertisement
 
Advertisement
Advertisement