
టెస్టు క్రికెట్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఏడో భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో పాట్ కమిన్స్ క్యాచ్ పట్టిన రహానే.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ జాబితాలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 209 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అదే విధంగా ప్రపంచక్రికెట్‌లో కూడా ఈ ఘనత సాధించిన లిస్టులో ద్రవిడే తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే (205) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: WTC Final: ఆసీస్ బౌలర్ సూపర్ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్