Worst Playing XI of IPL 2025: కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌.. | Worst Playing XI of IPL 2025 ft. MS Dhoni, Rishabh Pant | Sakshi
Sakshi News home page

Worst Playing XI of IPL 2025: కెప్టెన్‌గా రిష‌బ్ పంత్‌..

Jun 6 2025 11:20 AM | Updated on Jun 6 2025 11:31 AM

Worst Playing XI of IPL 2025 ft. MS Dhoni, Rishabh Pant

రెండు నెల‌ల పాటు క్రికెట్ అభిమానులను ఉరూతలూగించిన ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు మంగ‌ళ‌వారం(జూన్ 3) ఎండ్‌కార్డ్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ విజేత‌గా నిలిచిన  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.. త‌మ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది.

అయితే ఈ ఏడాది సీజ‌న్‌లో ఎటువంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన సాయిసుద‌ర్శ‌న్‌(ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్‌), ప్ర‌సిద్ద్ కృష్ణ(పర్పుల్ క్యాప్ విజేత) అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్ట‌గా..  రిష‌బ్ పంత్‌, వెంక‌టేష్ అయ్య‌ర్ వంటి ఖ‌రీదైన ఆట‌గాళ్లు తీవ్ర నిరాశ‌ప‌రిచారు.  ఈ క్ర‌మంలో ఐపీఎల్‌-2025లో  విఫ‌ల‌మైన ఆట‌గాళ్ల‌తో కూడిన ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఓ న్యూస్‌ వెబ్‌సైట్ ప్ర‌క‌టించింది.

ర‌చిన్ ర‌వీంద్ర
మెగా వేలంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ ర‌చిన్ ర‌వీంద్ర‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ. 4 కోట్ల‌కు కొనుగోలు చేసింది. కానీ ర‌వీంద్ర మాత్రం త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన ర‌వీంద్ర‌.. 8 మ్యాచ్‌ల్లో 191 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు.

ఇషాన్ కిష‌న్‌..
ఇషాన్ కిష‌న్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ అంచ‌నాలు పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే అత‌డిపై రూ.11.25 కోట్ల భారీ ధ‌ర ఎస్ఆర్‌హెచ్ వెచ్చింది. కానీ కిష‌న్ మాత్రం అంచ‌నాల త‌గ్గ‌ట్టు రాణించిలేక‌పోయాడు. తొలి మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన కిష‌న్‌.. తిరిగి మ‌ళ్లీ ఆఖ‌రి మ్యాచ్‌లో మెరిశాడు. మిగితా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫ‌ల‌మయ్యాడు. ఓవ‌రాల్‌గా 14 మ్యాచ్‌లు ఆడి 354 ప‌రుగులు చేశాడు.

రిష‌బ్ పంత్‌..
ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచిన పంత్‌.. త‌న ధ‌ర‌కు త‌గ్గ న్యాయం చేయ‌లేక‌పోయాడు. ఆఖ‌రి మ్యాచ్‌లో సెంచ‌రీ మిన‌హా మిగితా మ్యాచ్‌ల‌లో విఫ‌ల‌మ‌య్యాడు. 13 మ్యాచ్‌ల‌లో 269 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల‌గాడు. స‌ద‌రు వెబ్‌సైట్ ఈ జ‌ట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

వెంక‌టేశ్ అయ్య‌ర్‌..
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన వెంక‌టేశ్ అయ్య‌ర్ ఐపీఎల్ చరిత్ర‌లో అత్యంత ఖ‌రీదైన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. అయ్య‌ర్‌ను ఐపీఎల్ మెగా వేలంలో రూ.23.75 కోట్ల‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అయ్య‌ర్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. సీజ‌న్ మొత్తంలో  అతడు 11 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

గ్లెన్ మాక్స్‌వెల్‌..
పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఆడిన గ్లెన్ మాక్స్‌వెల్ సైతం తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ ఆసీస్ స్టార్ 6 మ్యాచ్‌లు ఆడి 48 ప‌రుగుల‌తో పాటు కేవ‌లం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

నితీష్ కుమార్ రెడ్డి
ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు నితీష్ కుమార్ రెడ్డిని ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. గ‌తేడాది ఎమర్జింగ్ ప్లేయ‌ర్‌గా నిలిచిన నితీష్‌.. ఈ ఏడాది సీజ‌న్ మాత్రం దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 14 మ్యాచ్‌లు ఆడి 182 ప‌రుగుల‌తో పాటు 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ధోని(వికెట్ కీప‌ర్‌)
సీఎస్‌కే దిగ్గ‌జం ఎంఎస్ ధోనికి ఇది మ‌ర్చిపోలేని సీజ‌న్‌. ఈ ఏడాది ధోనికి చాలా మ్యాచ్‌ల‌లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికి సద్వినియోగ ప‌ర‌చుకోలేక‌పోయాడు. 14 మ్యాచ్‌ల్లో 135 ప‌రుగులు చేశాడు.

వీరితో స్టార్ ప్లేయ‌ర్లు ర‌షీద్ ఖాన్‌(గుజ‌రాత్ టైటాన్స్‌), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(సీఎస్‌కే), మ‌హ్మ‌ద్ ష‌మీ(ఎస్ఆర్‌హెచ్‌), దీప‌క్ చాహ‌ర్ సైతం తీవ్ర నిరాశ‌ప‌రిచారు.
Worst Playing XI of IPL 2025:  రచిన్‌ రవీంద్ర, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌(కెప్టెన్‌), నితీష్‌ కుమార్‌ రెడ్డి, ధోని(వికెట్‌ కీపర్‌), మాక్స్‌వెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌,ర‌షీద్ ఖాన్‌,ర‌విచంద్ర‌న్ అశ్విన్‌,మ‌హ్మ‌ద్ ష‌మీ,దీప‌క్ చాహ‌ర్ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement