World Cup Warm Up Matches: బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌, శ్రీలంక | Sakshi
Sakshi News home page

World Cup Warm Up Matches: బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌, శ్రీలంక

Published Fri, Sep 29 2023 2:45 PM

World Cup Warm Up Matches: Pakistan And Sri Lanka Batting First, SA VS AFG Match Delayed Due To Rain - Sakshi

భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్‌ 29) నుంచి స్టార్ట్‌ అయ్యాయి. ఇవాళ మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌.. గౌహతి వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య తివేండ్రం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. తివేండ్రంలో భారీ వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా పడలేదు. మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్‌ అయ్యాయి.

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌..
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ 6 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (1) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 31/1గా ఉంది. అబ్దుల్లా షఫీక్‌ (12), బాబర్‌ ఆజమ్‌ (16) క్రీజ్‌లో ఉన్నారు.

ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు..
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక థాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (25), కుశాల్‌ పెరీరా (21) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 46/0గా ఉంది. 

పాకిస్తాన్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, ఫకర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, అఘా సల్మాన్‌, సౌద్‌ షకీల్‌, షాదాబ్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నవాజ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌, హరీస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ, మొహమ్మద్‌ వసీం జూనియర్‌, షాహీన్‌ అఫ్రిది, ఉసామా మిర్‌

న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, డారిల్‌ మిచెల్‌, జేమ్స​్‌ నీషమ్‌, రచిన్‌ రవీంద్ర, విల్‌ యంగ్‌, మిచెల్‌ సాంట్నర్‌, డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, ఐష్‌ సోధి, టిమ్‌ సౌథీ 

శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్‌), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్‌ హేమంత, దిల్షన్‌ మధుశంక

బంగ్లాదేశ్‌: షకీబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీం, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, మెహిది హసన్‌ మీరజ్‌, తౌహిద్‌ హ్రిదోయ్‌,తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షొరీఫుల్‌ ఇస్లాం, హసన్‌ మహమూద్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌, తంజిమ్‌ షకీబ్‌, తంజిద్‌ తమీమ్‌, మహ్మదుల్లా రియాద్‌

ఆఫ్ఘనిస్తాన్‌: హస్మతుల్లా షాహిది (కెప్టెన్‌), ఇబ్రహీమ్‌ జద్రాన్‌, రియాజ్‌ హసన్‌, నజీబుల్లా జద్రాన్‌, రెహ్మాత్‌ షా, మొహమ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇక్రమ్‌ అలికిల్‌, అబ్దుల్‌ రహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హాక్‌ ఫారూకీ, నవీన్‌ ఉల్‌ హాక్‌

సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్క్రమ్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, మార్కో జన్సెన్‌, అండిల్‌ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, కేశవ్‌ మహారాజ్‌, లుంగి ఎంగిడి, లిజాడ్‌ విలియమ్స్‌, కగిసో రబాడ, తబ్రేజ్‌ షంషి

Advertisement

తప్పక చదవండి

Advertisement