
వెస్టిండీస్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్, వరల్డ్‌కప్ విన్నర్ బెర్నార్డ్ జూలియన్(75) మరణించారు. అనారోగ్యం కారణంగా ట్రినిడాడ్‌లోని ఓ అస్పత్పిల్రో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షాలో ధ్రువీకరించారు.
"బెర్నార్డ్ జూలియన్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. విండీస్ గొప్ప క్రికెటర్లలో జూలియన్ ఒకరు. ఆయన సుదీర్ఘ కాలం పాటు విండీస్ క్రికెట్‌కు తన సేవలను అందించాడు. విండీస్ క్రికెట్ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయంగా నిలిపోతారు.
బెర్నార్డ్ జూలియన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని ఓ ప్రకటనలో కిషోర్ షాలో పేర్కొన్నారు. మరో విండీస్ లెజెండ్, మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ సైతం బెర్నాల్డ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బెర్నాల్డ్‌తో తన జ్ఞాపకాలను లాయిడ్ గుర్తుచేసుకున్నారు.
1975లో వెస్టిండీస్ తొలిసారిగా ప్రపంచకప్ గెలవడంలో జూలియన్‌ది కీలక పాత్ర. టోర్నీ అంతటా ఆల్‌రౌండర్‌గా ఆయన అదరగొట్టారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 4 వికెట్లతో సత్తాచాటిన బెర్నార్డ్.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 26 పరుగులతో ఆజేయంగా నిలిచి విండీస్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. జూలియన్ తన కెరీర్‌లో విండీస్ తరపున 24 టెస్టు మ్యాచ్‌లు, 12 వన్డేలు ఆడారు. మొత్తంగా 932 పరుగులు, 68 వికెట్లు పడగొట్టారు.