‘ఆ స్పిన్నర్‌ గురించే ఎక్కువ మాట్లాడాలి’ | We Should Be Talking About Chahal More, Gautam Gambhir | Sakshi
Sakshi News home page

‘ఆ స్పిన్నర్‌ గురించే ఎక్కువ మాట్లాడాలి’

Oct 6 2020 6:45 PM | Updated on Oct 6 2020 6:57 PM

We Should Be Talking About Chahal More, Gautam Gambhir - Sakshi

న్యూఢిల్లీ: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌పై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ సాధించిన విజయాల్లో చహల్‌ పాత్ర గురించే ఎక్కువగా మాట్లాడుకోవాలని గంభీర్‌ కొనియాడాడు. ప్రస్తుతం ఈ స్పిన్నర్‌ గురించి ఎంతమాట్లాడినా తక్కువే అవుతుందన్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందు జస్‌ప్రీత్‌ బుమ్రా, కగిసో రబడా, రషీద్‌ ఖాన్‌, జోఫ్రా ఆర్చర్‌, ప్యాట్‌ కమిన్స్‌లపైనే ఎక్కువ హైప్‌ క్రియేట్‌ అయ్యిందని, కానీ అంచనాలకు మించి రాణిస్తున్న ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ గురించి ఇక మరింత ఎక్కువ మాట్లాడే సమయం ఆసన్నమైందన్నాడు గంభీర్‌. (చదవండి:భువీ స్థానంలో పృథ్వీ రాజ్‌ యర్రా)

‘ఈ సీజన్‌లో చహల్‌ బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. మనం ఇంతకుముందు చూడని చహల్‌ను ఇప్పుడు చూస్తున్నాం. ఈ సీజన్‌కు ముందు చహల్‌పై అంతగా అంచనాలు లేవు. కానీ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగిపోతున్నాడు. మనం ఈ సీజన్‌ ఆరంభానికి ముందు రషీద్‌ ఖాన్‌, జోఫ్రా ఆర్చర్‌, బుమ్రాలతో పాటు రబడా, కమిన్స్‌ల గురించే మాట్లాడాం. వీరే కీలకం కానున్నారని అనుకున్నాం. కానీ వీరందరి కంటే చహల్‌ ఎక్కువ హైప్‌ అయ్యాడు. ఆర్సీబీ విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్‌ తెలిపాడు.  ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement