ముంబై ఇంకా ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది: షేన్ బాండ్

We are still in the competition MI bowling Coach Shane Bond - Sakshi

Shane Bond Commnets On Mumbai Indians: ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ముఖ్యంగా సెకెండ్‌ ఫేజ్‌లో ఆడిన 5 మ్యాచుల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమి చెందింది. ఫలితంగా డిఫెండింగ్ ఛాంపియన్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో జట్టు ఆటతీరుపై ముంబై బౌలింగ్‌ కోచ్‌ షేన్ బాండ్ స్పందించాడు. ఐపీఎల్‌ 2021లో ముంబైకు  ఇంకా ప్లేఆఫ్‌కు ఆర్హత సాధించే అవకాశం ఉందని బాండ్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌లో  ముంబై ఇండియన్స్  అత్యుత్తమంగా ఆడలేదని బాండ్ అంగీకరించాడు.

"మేము  ఐపీఎల్‌ మెదటి దశలో బాగా ఆడాము. మేము ప్రస్తుతం బాగా ఆడడంలేదని తెలుసు, కానీ మేము ఇంకా పోటీలో ఉన్నాము. ఏమి జరుగుతుందో మేము చూస్తాము. మేము ఐదు విజయాలు మాత్రమే సాధించాము, కానీ మా జట్టు రెండు విజయాలు సాధించగలిగితే  ఫలితాలు మారవచ్చు అని  మ్యాచ్‌ అనంతరం విలేఖేరల సమావేశంలో  షేన్ బాండ్ పేర్కొన్నాడు. 145 పరుగులు సాధించింటే ఢిల్లీ క్యాపిటల్స్‌పై  ముంబై  విజయం సాధించేదని అని బాండ్‌ చెప్పాడు. కాగా  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 10 పాయింట్లతో  7 వ స్థానంలో ఉంది.

చదవండి: CSK VS RR: ఫిలిప్స్‌ ఫన్నీ బ్యాటింగ్‌ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్‌’’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top