#Hardik Pandya: ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. కష్టంగా ఉంది! ట్రోఫీ మాత్రం మనదే!

WC 2023: Hardik Pandya Gets Emotional Says Tough To Digest Miss WC - Sakshi

Cricket World Cup 2023- Hardik Pandya Emotional Note: ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది.  ప్రతి మ్యాచ్‌.. ప్రతి బాల్‌.. ప్రతిచోటా జట్టును చీర్‌ చేస్తూ అక్కడే తిరుగుతూ ఉంటుంది.

కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

సెమీస్‌ నాటికి కోలుకుంటాడని భావిస్తే
కాగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్యా చీలమండకు గాయమైన విషయం తెలిసిందే. అయితే, జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. సెమీస్‌ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు.

పాండ్యా స్థానంలో ప్రసిద్‌ కృష్ణ
కానీ దురదృష్టవశాత్తూ.. గాయం తీవ్రంగా ఉండటంతో టోర్నీ మధ్యలోనే అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో పాండ్యా స్థానంలో కర్ణాటక బౌలర్‌, టీమిండియా యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ వరల్డ్‌కప్‌ జట్టులోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీకి ఇలా దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు.

అయితే, ప్రస్తుత భారత జట్టు ఎంతో ప్రత్యేకమైనదని.. ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందంటూ సహచరులను కొనియాడాడు. స్వదేశంలో టీమిండియా మరోసారి ట్రోఫీ గెలవడం ఖాయమని హార్దిక్‌ పాండ్యా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశాడు.

అజేయంగా నిలిచి సెమీస్‌లో
వన్డే ప్రపంచకప్‌ పదమూడవ ఎడిషన్‌లో రోహిత్‌ సేన ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఏడూ గెలిచింది. చివరగా ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్‌ చేరింది. లీగ్‌ దశలో తదుపరి సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-11-2023
Nov 11, 2023, 21:37 IST
వన్డే ప్రపంచకప్‌-2023ను ఇంగ్లండ్‌ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల...
11-11-2023
Nov 11, 2023, 21:09 IST
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి...
11-11-2023
Nov 11, 2023, 20:13 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు అర్హత...
11-11-2023
Nov 11, 2023, 19:32 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో...
11-11-2023
Nov 11, 2023, 19:01 IST
పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 18:20 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే...
11-11-2023
Nov 11, 2023, 18:06 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు తమ బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 17:15 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌.. తర్వాతి...
11-11-2023
Nov 11, 2023, 16:35 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌...
11-11-2023
Nov 11, 2023, 15:47 IST
వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో...
11-11-2023
Nov 11, 2023, 14:13 IST
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన...
11-11-2023
Nov 11, 2023, 13:53 IST
ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్‌ క్రికెట్‌...
11-11-2023
Nov 11, 2023, 11:27 IST
ICC WC 2023: వన్డే ప్రపంచకప​-2023లో అఫ్గనిస్తాన్‌ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు...
11-11-2023
Nov 11, 2023, 10:32 IST
CWC 2023- Australia vs Bangladesh: వన్డే వరల్డ్‌కప్‌-2023 లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది....
11-11-2023
Nov 11, 2023, 09:39 IST
భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకోగా.....
11-11-2023
Nov 11, 2023, 08:47 IST
ICC WC 2023- Afghanistan: వన్డే వరల్డ్‌కప్‌-2023లో తమ జట్టు ప్రదర్శన పట్ల అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది సంతోషం...
10-11-2023
Nov 10, 2023, 21:53 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...
10-11-2023
Nov 10, 2023, 20:51 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా...
10-11-2023
Nov 10, 2023, 20:17 IST
దక్షిణాఫ్రికా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒక మ్యాచ్‌లో...
10-11-2023
Nov 10, 2023, 19:15 IST
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్‌ అవుట్‌’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top