IND Vs AUS: ఆసీస్‌ అరంగేట్ర ఆట‌గాడితో కోహ్లి వాగ్వాదం.. వీడియో వైర‌ల్‌! | IND Vs AUS 4th Test: Heated Argument Between Virat Kohli And Sam Konstas Melbourne, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs AUS 4th Test: ఆసీస్‌ అరంగేట్ర ఆట‌గాడితో కోహ్లి వాగ్వాదం.. వీడియో వైర‌ల్‌!

Dec 26 2024 8:33 AM | Updated on Dec 26 2024 9:47 AM

Virat Kohli sledges fiery Sam Konstas in Melbourne

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు నుంచే వాడీవేడిగా సాగుతోంది. మొద‌టి రోజు ఆటలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, ఆసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

19 ఏళ్ల సామ్ కాన్‌స్టాస్ త‌న డెబ్యూ మ్యాచ్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కాన్‌స్టాస్ జ‌స్ప్రీత్ బుమ్రా లాంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్‌ను సైతం అలోవ‌క‌గా ఎదుర్కొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ ఆసీస్ యువ సంచ‌ల‌నాన్ని అడ్డుకొనేందుకు భారత పేసర్లు చాలా కష్టపడ్డారు. ఈ క్ర‌మంలో కాన్‌స్టాస్‌ ఏకాగ్ర‌త‌ను దెబ్బ తీసేందుకు విరాట్ కోహ్లి స్లెడ్జింగ్‌కు దిగాడు.

కాన్‌స్టాస్‌ నడిచి వస్తుండగా విరాట్ త‌న భుజం తగిలించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం చోటు చేసుకుంది. వెంట‌నే ఉస్మాన్ ఖావాజా, అంపైర్ జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. అయితే కోహ్లి చర్యలు ఐసీసీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో జ‌రిమానా ప‌డే అవ‌కాశముంది. 

కాగా ఈ సంఘటన తర్వాత కాన్‌స్టాస్‌ మరింత చెలరేగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 65 బంతులు ఎదుర్కొన్న 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.
చదవండి: గెలుపు పంచ్‌ ఎవరిదో?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement