IND vs WI: విరాట్ కోహ్లిని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. తొలి ఆట‌గాడిగా!

Virat Kohli ready to become top run scorer in T20Is - Sakshi

వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్ప‌డు టీ20 సిరీస్‌కు సిద్ద‌మైంది. కోల్‌క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి16న‌ మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ విండీస్‌- భార‌త్ మ‌ధ్య ప్రారంభం కానుంది. ఇక తొలి టీ20కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిను ప్ర‌పంచ రికార్డు ఊరిస్తోంది. రానున్న టీ20 సిరీస్‌లో కోహ్లి మ‌రో 75 ప‌రుగులు సాధిస్తే అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలుస్తాడు.

తొలి స్ధానంలో 3299 ప‌రుగుల‌తో న్యూజిలాండ్ బ్యాట‌ర్ మార్టిన్ గుప్టిల్ ఉండ‌గా, రెండో స్ధానంలో 3227 ప‌రుగుల‌తో కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక మూడో స్ధానంలో 3197 ప‌రుగుల‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. మ‌రో వైపు టీమిండియా స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ కూడా ఓ అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉన్నాడు. ఒకే ఒక వికెట్ సాధిస్తే అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో భార‌త త‌రుపున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా నిలుస్తాడు. జ‌స్ప్రీత్ బుమ్రా 66 వికెట్లు ప‌డ‌గొట్టి తొలి స్ధానంలో ఉండ‌గా, చాహ‌ల్ 65 వికెట్లు సాధించి రెండో స్ధానంలో ఉన్నాడు.

చ‌ద‌వండి: IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top