కోహ్లిని ఇలా ఎప్పుడైనా చూశారా? | Virat Kohli To Play 200th Game For RCB | Sakshi
Sakshi News home page

కోహ్లిని ఇలా ఎప్పుడైనా చూశారా?

Oct 15 2020 8:43 PM | Updated on Oct 16 2020 7:24 PM

Virat Kohli To Play 200th Game For RCB - Sakshi

షార్జా: ఈ ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన మార్కును చేరాడు. గురువారం షార్జాలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ కోహ్లికి ఆర్సీబీ తరఫున 200వ మ్యాచ్‌.  ఇది ఐపీఎల్‌లో కోహ్లికి ఆర్సీబీ తరపున 185 మ్యాచ్‌ కాగా, చాంపియన్స్‌ లీగ్‌ టీ20(సీఎల్‌టీ20) అదే ప్రాంఛైజీ తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. ఫలితంగా ఒక ఫ్రాంచైజీకి 200వ మ్యాచ్‌ ఆడుతున్న ఘనతను నమోదు చేశాడు. కాగా, ఆర్సీబీకి 117 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన కోహ్లి జట్టుకు 55 విజయాలు అందించాడు. కోహ్లి నేతృత్వంలో ఆర్సీబీ 58 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. 

ఇదిలా ఉంచితే,  కింగ్స్‌ పంజాబ్‌తో తాజా మ్యాచ్‌లో కోహ్లి మంచి జోష్‌లో కనిపించాడు. మ్యాచ్‌కు ముందు వార్మప్‌ సెషన్‌లో భాగంగా  గ్రౌండ్‌లో డ్యాన్స్‌ తో ఇరగదీశాడు. క్రింది దొర్లుతూ స్టెప్పులు మిక్స్‌ చేసి మరీ అలరించాడు. తన స్టెప్పులకు తానే నవ్వుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన కోహ్లి అభిమానులు మాత్రం తెగ మురిసిపోతున్నారు. కోహ్లి ఏమి జోష్‌ అంటూ కొనియాడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement