Virat Kohli Maintains Highest Fitness Standards As 23 Teammates Went To NCA For Rehab In 2021-22 - Sakshi
Sakshi News home page

హిట్‌ ఫిట్‌ కోహ్లి.. ఎన్‌సీఏ గడప తొక్కని ఒకే ఒక్క టీమిండియా క్రికెటర్‌

Oct 15 2022 7:30 PM | Updated on Oct 15 2022 7:54 PM

Virat Kohli Maintains Highest Fitness Standards As 23 Teammates Went To NCA For Rehab In 2021 22 - Sakshi

భారత క్రికెట్‌ జట్టులో ఫిట్‌ క్రికెటర్‌ ఎవరని అడిగితే.. అందరూ ఠక్కున విరాట్‌ కోహ్లి పేరే చెబుతారు. అతని 14 ఏళ్ల కెరీర్‌లో ఫిట్‌నెస్‌ లేమి కారణంగా దూరమైన మ్యాచ్‌లు కేవలం నాలుగు మాత్రమే అంటే తప్పనిసరిగా నమ్మి తీరాల్సిందే. ఈ ఒక్క లెక్క చాలు అతని ఫిట్‌నెస్‌ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. తాజాగా కోహ్లి ఫిట్‌నెస్‌ గురించిన ఓ న్యూస్‌  ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

2021-22 సంవత్సరంలో విరాట్‌ ఒక్కసారి కూడా నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) గడప తొక్కలేదని బీసీసీఐ ఓ నివేదికలో పేర్కొంది. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన 24 మంది క్రికెటర్లలో ఒక్క కోహ్లి మాత్రమే ఎన్‌సీఏలో అడుగుపెట్టలేదని బీసీసీఐ సీఈవో హేమంగ్‌ అమిన్‌ తెలిపారు. 

ఇండియా ఏ, ఇండియా అండర్ 19, వుమెన్స్ టీమ్, స్టేట్ ప్లేయర్లలో 70 మంది 96 రకాల గాయాల కారణంగా ఎన్‌సీఏ పర్యవేక్షనలో ఉ​న్నారని అమిన్‌ పేర్కొన్నారు. భారత పురుషుల జట్టులో కోహ్లి మినహా రోహిత్‌ శర్మ (హ్యామ్‌స్ట్రింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (హెర్నియా), చతేశ్వర్‌ పుజారా, శిఖర్‌ ధవన్‌, హార్ధిక్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రిషబ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, మయాంక్‌ అగర్వాల్‌, యుజ్వేంద్ర చహల్‌, వాషి​ంగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అజింక్య రహానే,అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వృద్ధిమాన్ సాహా, షమీ, దీపక్‌ చాహర్‌, ఇషాంత్‌ శర్మ.. ఇలా సీనియర్లు,జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్నారు. 

వీరే కాక టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మనీశ్ పాండే, నవ్‌దీప్ సైనీ, ప్రియాంక్ పంచల్, శుభ్‌‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అర్ష్‌దీప్ సింగ్, దేవ్‌దత్ పడిక్కల్, ఇషాన్ పోరెల్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, పృథ్వీ షా, సిమ్రన్‌జీత్ సింగ్, కేఎస్ భరత్, వరుణ్ అరోన్, వెంకటేశ్ అయ్యర్ కూడా ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement