ఫేవరెట్‌గా టీమిండియా.. టాప్‌లో కోహ్లి | Virat Kohli Led India Eye Change Of Fortunes | Sakshi
Sakshi News home page

ఫేవరెట్‌గా టీమిండియా.. టాప్‌లో కోహ్లి

Dec 4 2020 1:16 PM | Updated on Dec 4 2020 2:48 PM

Virat Kohli Led India Eye Change Of Fortunes - Sakshi

కాన్‌బెర్రా:  ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత పొట్టి ఫార్మాట్‌లో తలపడుతోంది టీమిండియా. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో ఈ ఫార్మాట్‌తో టీమిండియా ప్రధాన ఆటగాళ్లు రాహుల్, ధావన్, హార్దిక్, బుమ్రా మంచి టచ్‌లో ఉన్నారు. ఇటీవల వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన నటరాజన్‌.. టీ20ల్లో సైతం అరంగేట్రం చేశాడు.

మరో వైపు ఐపీఎల్‌లో విఫలమైన ఆసీస్‌ క్రికెటర్లు స్మిత్, మ్యాక్స్‌వెల్‌ ఇక్కడ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. బ్యాటింగ్‌ అనుకూలమైన పిచ్‌ కావడంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఆసీస్‌ జట్టులో డేవిడ్‌ వార్నర్‌, ప్యాట్‌ కమిన్స్‌లు లేకపోవడం లోటు. గాయం కారణంగా వార్నర్‌ దూరం కాగా, కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. (ఐపీఎల్‌లో మరో రెండు జట్లు!)

భారత్, ఆసీస్‌ మధ్య జరిగిన 20 టి20ల్లో భారత్‌ 11 గెలిచి 8 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2018లో ఇరుజట్లు రెండు టీ20లు జరగ్గా అందులో ఒకదాంట్లో భారత్‌ విజయం సాధించింది, మరొకదాంట్లో ఫలితం తేలలేదు. వర్షం కారణంగా ఆసీస్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత ఆ మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక 2016లో ఆసీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తేడాతో గెలిచింది.  ఇరుజట్లు తలపడిన చివరి ఐదు టీ20ల్లో ఆసీస్‌ మూడు గెలిచింది.

టాప్‌లో  కోహ్లి
టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిదే పైచేయి. ఇప్పటివరకూ ఆసీస్‌తో జరిగిన టీ20ల్లో కోహ్లి 584 పరుగులు సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు. 2016లో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. మూడు బ్యాక్‌ టు బ్యాక్‌ హాఫ్‌ సెంచరీలు సాధించి టీమిండియా 3-0 తేడాతో సిరీస్‌ను గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఆ తర్వాత స్థానంలో ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(405) ఉన్నాడు. టీమిండియాతో ఆడిన గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో ఫించ్‌ రెండుసార్లు డకౌట్‌గా నిష్క్రమించాడు.  


టీమిండియా
కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌,  కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌  సుందర్‌, దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ షమీ, టీ నటరాజన్‌

ఆస్ట్రేలియా
అరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), డీఆర్సీ షార్ట్‌, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్యూస్‌, సీన్‌ అబాట్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వీప్‌సన్‌, ఆడమ్‌ జంపా, హజల్‌వుడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement