Virat Kohli Is The First And Only Player Ever To Take A Wicket Off The 0th Ball In Men's Internationals - Sakshi
Sakshi News home page

బాల్‌ వేయకుండా వికెట్‌ తీసుకున్న ఏకైక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో నిలిచిన విరాట్‌

Aug 18 2023 7:47 PM | Updated on Aug 18 2023 8:11 PM

Virat Kohli Is First And Only Player Ever To Take A Wicket Off 0th Ball In Mens Internationals - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడిగా, రికార్డుల రారాజుగా కీర్తించబడే రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి.. బౌలింగ్‌ విభాగంలోనూ తనదైన రి​కార్డు మార్కు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (2023 ఆగస్ట్‌ 18) ఈ ఆసక్తికర రికార్డు వివరాలు మీ కోసం. 

బాల్‌ వేయకుండానే వికెట్‌ తీసుకున్న ఏకైక క్రికెటర్‌గా..
2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో తొలిసారి బంతి పట్టిన విరాట్‌.. బంతి వేయకుండానే తన ఖాతాలోకి వికెట్‌ను జమ చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటికీ ఇది ఓ రికార్డే. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) ఇప్పటివరకు ఏ క్రికెటర్‌ కూడా ఈ ఘనత సాధించలేదు. హేమాహేమీలైన బౌలర్లకు కూడా ఇది సాధ్యపడలేదు.

బంతి వేయకుండానే వికెట్‌ ఎలా..?
ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. నాటి కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బంతి విరాట్‌కు ఇచ్చాడు. విరాట్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి బంతినే వైడ్‌ బాల్‌గా వేయగా.. అది కూడా అతనికి కలిసొచ్చింది. లెగ్‌సైడ్‌ వెళ్తున్న బంతిని ధోని అద్భుతంగా అందుకుని, షాట్‌ ఆడే క్రమంలో క్రీజ్‌ దాటిన పీటర్సన్‌ను స్టంపౌట్‌ చేశాడు.  ఇలా బంతి కౌంట్‌లోకి రాకుండానే ఓ పరుగు ఇచ్చి ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు విరాట్‌.

ఇదిలా ఉంటే, 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కాలక్రమంలో కోహ్లి ఏరకంగా రాటుదేలాడో.. ఎన్ని పరుగులు, రికార్డులు,సెంచరీలు చేశాడో విశ్వం మొత్తం చూసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement