Virat Kohli: ఆర్‌సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ

Virat Kohli Captaincy Ends For RCB Without IPL Title Viral - Sakshi

Virat Kohli RCB Captain As Last IPL 2021... ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి కథ ముగిసింది. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టి కెప్టెన్‌గా ఘనమైన  వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్‌గా వైదొలిగాడు. వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇంటిబాట పట్టింది. గతేడాది సీజన్‌(ఐపీఎల్‌ 2020)లో ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడిన ఆర్‌సీబీకీ ఈ సీజన్‌లో కేకేఆర్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ లేకుండానే ఒక జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. 

చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం


Courtesy: IPL Twitter
2013 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. అతని కెప్టెన్‌గా పని చేసిన కాలంలో ఆర్‌సీబీ  ఒకసారి రన్నరఫ్‌(2016 ఐపీఎల్‌ సీజన్‌), మరో మూడుసార్లు ప్లేఆఫ్స్‌(2015, 2020, 2021 )చేరింది. కెప్టెన్‌గా ఆర్‌సీబీకి టైటిల్‌ అందించడంలో విఫలమయ్యాడేమో కానీ బ్యాట్స్‌మన్‌గా మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు. 

ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఐపీఎల్‌ 2021 సీజన్‌ చివరిదని.. ఇకపై ఆ జట్టుకు ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని సెకండ్‌ఫేజ్‌ ఆరంభంలోనే ప్రకటించాడు. దీంతో ఆర్‌సీబీ టీమ్ ఎలాగైనా కోహ్లికి కప్‌  అందించి ఘనమైన వీడ్కోలు పలకాలని భావించింది. అందుకు తగ్గట్టుగానే లీగ్‌ దశలో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా మంచి ప్రదర్శన కనబరిచి ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే ప్లేఆఫ్స్‌ దశలో తమకు అలవాటైన ఒత్తిడిని అధిగమించడంలో ఆర్‌సీబీ మరోసారి విఫలమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top