విజేందర్‌ 12 నాటౌట్‌..ఈసారి రష్యా బాక్సర్‌! | Vijender Singh To Take On Russian Artysh Lopsan In Goa On March 19 | Sakshi
Sakshi News home page

విజేందర్‌ 12 నాటౌట్‌..ఈసారి రష్యా బాక్సర్‌!

Mar 13 2021 5:49 PM | Updated on Mar 13 2021 5:49 PM

Vijender Singh To Take On Russian Artysh Lopsan In Goa On March 19 - Sakshi

పనాజీ:  తన ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌లో 12–0తో అజేయంగా దూసుకెళ్తున భారత స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. ఏడాది తర్వాత అతను మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 19న గోవాలో జరిగే బౌట్‌లో రష్యా బాక్సర్‌ ఆర్తిస్‌ లాప్సన్‌తో విజేందర్‌ తలపడనున్నాడు. 

సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ విభాగంలో జరిగే ఈ బౌట్‌ పనాజీలోని మెజెస్టిక్‌ ప్రైడ్‌ క్యాసినో షిప్‌లో జరగనుంది. విజేందర్‌ ప్రత్యర్థి లాప్సన్‌ ఇప్పటివరకు ఆరు ప్రొఫెషనల్‌ బౌట్‌లలో పాల్గొనగా... నాలుగింటిలో విజయం సాధించాడు.  కాగా, 2019, నవంబర్‌లో చివరిసారి తలపడిన విజేందర్‌..కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ చార్లెస్‌ అడామూ (ఘనా)ను ఓడించాడు. దాంతో తన విజయాల సంఖ్యను 12కు పెంచుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement